Ys Sharmila Tour: ఏపీసీసీ ఛీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడోరోజే వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేపట్టారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన పర్యటన జనవరి 31 వరకూ కొనసాగుతుంది. చివరిగా కడప జిల్లా పర్యటనతో ముగియనుంది. వినూత్న శైలిలో నిర్వహిస్తున్న ఆమె పర్యటనలో జనాన్ని భాగంగా చేసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటన ప్రారంభమైంది. రోజుకు రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇలా 9 రోజుల్లో మొత్తం 26 జిల్లాలు చుట్టి..పార్టీ పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఇవాళ మొదటిరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చేరుకున్న ఆమె అక్కడ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్డినరీ ఆర్టీసీ బస్సెక్కారు. ఇతర మహిళా ప్రయాణికుల పక్కన కూర్చుని పలాస వరకూ ప్రయాణించారు. ఇఛ్చాపురం నుంచి పలాస మధ్య 50 కిలోమీటర్ల దూరముంటుంది.


ఈలోగా బస్సులో ఇతర ప్రయాణీకులతో కలిసి చిట్‌చాట్ ప్రారంభించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పధకాలు, ఇతర వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత అంశాలపై కూడా అక్కడున్న మహిళలతో ఆరా తీశారు. హఠాత్తుగా వైఎస్ షర్మిల బస్సు ఎక్కడంతో అందులో ప్రయాణీకులకు కాస్సేపు షాక్‌కు గురయ్యారు. షర్మిల మాట్లాడేకొద్దీ సరదాగా మాట్లాడుతూ ప్రయాణం చేశారు. వైఎస్ఆర్ బిడ్డ తమతో కలిసి ప్రయాణించడంపై ఆనందం వ్యక్తం చేశారు. 


ఈ సందర్భంగా బస్సులో ఎక్కిన కొంతమంది మీడియా వ్యక్తులతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి ఆమెపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అనడం ఆయనకు నచ్చడం లేదని..ఇకపై జగన్‌ను అన్నయ్య గారూ అనే పిలుస్తానని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో మీరు చేశానంటున్న ఆభివృద్ధిని చూపిస్తే చూసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.


Also read: Ap Voter List 2024: ఏపీ ఓటర్లలో శాసించేది మహిళలే, ఓటు హక్కు ఎప్పటి వరకూ నమోదు చేసుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook