రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధం
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సన్నద్ధమవుతోంది.

ఏపీ కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) విలయం నుంచి కోలుకుంటోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రోజుకు 2 వేలలోపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 462 ప్రైవేటు ఆసుపత్రుల్ని సిద్ధం చేసింది. గత 24 గంటల్లో 85 వేల 283 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2 వేల 50 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
అటు 18 మంది కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 531 మంది మరణించారు. మరోవైపు 2 వేల 458 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 48 వేల 828 మంది రాష్ట్రంలో కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 19 వేల 82 వేల 308 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 2 కోట్ల 51 లక్షల 93 వేల 429 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు.
Also read: స్వాతంత్య్ర దినోత్సవానికి శత్రుదుర్బేధ్యంగా ఎర్రకోట