Red Fort:దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఢిల్లీ ఎర్రకోట శత్రుదుర్బేధ్యంగా మారుతోంది. అనుమతి లేనిదే అడుగు పెట్టడం కష్టంగా మారనుంది.
పంద్రాగస్టు నాడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల (Independence day celebrations) కోసం ఢిల్లీ ఎర్రకోటను(Red Fort) సిద్ధం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) ప్రసంగం నేపధ్యంలో ఇటీవలి అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని శత్రుదుర్బేధ్యంగా మార్చుతున్నారు.చాందినీ చౌక్ ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఎర్రకోటలో ప్రవేశించలేనివిధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. షిప్పింగ్ కంటైనర్లతో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటవుతోంది. ఈ ఏర్పాటు గతంలో ఎప్పుడూ లేదు. కంటికి ఆకర్షణీయంగా కన్పించేందుకు రంగులతో తీర్దిదిద్దనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు(New Farm laws) వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు పంద్రాగస్టును అవకాశంగా తీసుకోవచ్చనే సమాచారంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.ఎందుకంటే జనవరి 26 నాటు గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్బంగా ఎర్రకోట వద్ద జరిగిన సమ్మె..హింసాత్మకంగా మారింది.
జనవరి 26 నాటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ద్రోన్లు, పారా గ్లైడర్స్, ఎయిర్ బెలూన్స్ ఎగురవేయడం నిషేధించారు. ఇటీవల ఎర్రకోట(Red Fort)వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్న ద్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని..కేసు నమోదు చేశారు. పంద్రాగస్టు నాడు ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.
Also read: ఐఆర్సీటీసీ లేటెస్ట్ న్యూస్: గణేష్ చతుర్థి స్పెషల్ ట్రైన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook