AP Covid Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై రేపు కీలకమైన సమావేశం జరగనుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తారా లేదా అనేది రేపు తేలనుంది. మరోవైపు గత 24 గంటల్లో ఏపీలో స్వల్పంగా కేసులు పెరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) భయంకర రూపం దాల్చేసింది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలో దిగజారుతున్న కరోనా పరిస్థితుల నేపధ్యంలో వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్ (Lockdown) అమలు చేస్తుంటే..కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ(Night Curfew), వీకెండ్ లాక్‌డౌన్ ( Weekend Lockdown) అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం (Ap government)ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమనే వాదన విన్పిస్తోంది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ (Ministers sub committee) రేపు సమావేశం కానుంది. ఆళ్ల నాని ( Minister Alla nani) కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో బొత్త సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కన్నబాబు ఉన్నారు. రేపు జరగనున్న సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ ( Lockdown) విధించే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. దాంతోపాటు ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, రెమ్‌డెసివిర్ అంశాలపై చర్చించనున్నారు.


మరోవైపు గత 24 గంటల్లో ఏపీలో స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 74 వేల 435 కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid Tests) నిర్వహించగా..11 వేల 434 మందికి పాజిటివ్ అని తేలింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 2 వేల 28 కేసులు నమోదు కాగా..చిత్తూరులో 1982 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 64 మంది మరణించారు. 7 వేల 55 మంది కోలుకున్నారు. 


Also read: AP Government: కోవిడ్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook