కరోనా వ్యాప్తి కారణంగా ఎంసెట్, ఐసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలు కొన్ని నెలలు ఆలస్యంగా నిర్వహించడం తెలిసిందే. అయితే ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2020 (AP EAMCET 2020) కు  కరోనా వైరస్ సోకడం, లేక దాని లక్షణాల వల్ల కొందరు అభ్యర్థులు హాజరుకాలేకపోయారు. వీరికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈ విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ఎంసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు వెల్లడించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సోకిన కారణంగా ఎంసెట్ పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు తమ హెల్ప్‌లైన్ సెంటర్‌  helpdeskeamcet2020@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు. ఆ మెయిల్‌లో అభ్యర్థులు తమ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్‌తో పాటు కరోనా సంబంధిత రిపోర్టులను పంపించాలని తెలిపారు. సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపిన వారికి ఏపీ ఎంసెట్ 2020 పరీక్షను నిర్వహించనున్నట్లు వివరించారు. మెయిల్స్ పరిశీలించిన తర్వాత ఎంసెట్ నిర్వహణ తేదీని ఖరారు చేసి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తామన్నారు.  అధికారిక వెబ్‌సైట్


 


కాగా, ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్ 2020 ప్రాథమిక కీని గత శనివారం విడుదల చేశారు. అయితే కరోనా వల్ల ఎంట్రన్స్‌కు హాజరుకాలేకపోయామని, ఏడాది కాలం వృథా అవుతుందన్న అభ్యర్థుల విన్నపాలను అర్థం చేసుకుని వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.  AP హెకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌  


 


మరిన్ని ఆసక్తికర కథనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe