Happy Birthday Sneha Reddy: భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్

కరోనా సమయంలో మొత్తంగా తన భార్య స్నేహారెడ్డి, పిల్లలకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. నేడు తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు (Allu Arjun Wife Sneha Birthday Celebrations) సందర్భంగా ఆమెకు బన్నీ బర్త్‌డే విషెస్ తెలిపాడు. 

Last Updated : Sep 29, 2020, 02:46 PM IST
Happy Birthday Sneha Reddy: భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్, మెగా హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం చూస్తుంటాం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో మొత్తంగా తన భార్య అల్లు స్నేహారెడ్డి, పిల్లలకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. నేడు తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు (Allu Arjun wife Sneha Reddy Birthday) సందర్భంగా ఆమెకు బన్నీ బర్త్‌డే విషెస్ తెలిపాడు. ‘నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని పుట్టినరోజు వేడుకలకు నీతోనే సమయం గడపాలి. హ్యాపీ బర్త్‌డే క్యూటీ.. #allusnehareddy’ అని బన్నీ పోస్ట్ చేశాడు.

భార్య స్నేహ పుట్టినరోజు వేడుకలు ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో నిర్వహించాడు అల్లు అర్జున్. ఈ మేరకు తన సతీమణి స్నేహకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె కేక్ కట్ చేపించి సంతోషంగా సెలబ్రేట్ చేశాడు. ఈ ఫొటోను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఫొటో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే 2 మిలియన్లకు పైగా, భారీగా కామెంట్లను సొంతం చేసుకుంది. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Many many happy returns of the day to the most special person in my life . . Wish to spend more n more birthdays with you . Happy birthday cutieeee... #allusnehareddy

A post shared by Allu Arjun (@alluarjunonline) on

కాగా, అల్లు అర్జున్, స్నేహలది ప్రేమ వివాహం. ప్రేమించుకున్న ఈ జంట 2011లో పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు అయాన్, కూతురు అర్హ ఉంది. నిత్యం ఏదో ఒక అప్ డేట్స్‌తో తమ అభిమానులను వీరు అలరిస్తుంటారు. AP హెకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌  

Ram Vriksha Gaur: చిన్నారి పెళ్లికూతురు డైరెక్టర్‌కు కరోనా కష్టాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News