AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ వెల్లడయ్యాక పార్టీల ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొత్తం అభ్యర్ధుల్ని ప్రకటించగా తెలుగుదేశం-జనసేన కూడా దాదాపుగా అభ్యర్ధుల జాబితా వెల్లడించింది. కూటమిలో మూడో పార్టీ బీజేపీ ఇంకా అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో తెలుగుదేశం పార్టీకు గట్టి దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి మాగంటి బాబు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన మాగంటి బాబు కుుటుంబం రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం. తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తల్లి మాగంటి లక్ష్మి ఇద్దరూ రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవాళ్లే. కమ్మ సామాజికవర్గంలో బలమైన కుటుంబం. ఎప్పట్నించి ఏలూరు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. 1998లో ఏలూరు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి తరువాత దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత తెలుగుదేశంలో చేరిన మాగంటి బాబు 2014లో ఎంపీగా గెలిచారు. తిరిగి 2014 లో ఎంపీగా గెలిచారు. 


ఈసారి ఎంపీ టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఎప్పుడూ కమ్మ సామాజికవర్గమే పోటీ చేసే ఏలూరు ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఈసారి యనమల రామకృష్ణుడు అల్లుడైన పుట్టా మహేశ్ యాదవ్‌కు ఇవ్వడంతో మాగంటి బాబుతో సహా కమ్మ సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అసలే ఇటీవల స్వల్ప వ్యవధిలో ఇద్దరు కుమారులు మరణించడంతో మానసిక వేదనతో ఉన్న మాగంటి బాబుకు టికెట్ లభించకపోవడం మరింత షాక్‌గా మారింది. ఈలోగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి మాగంటి బాబును పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. ఇందుకు మాగంటి బాబు కూడా అంగీకారం తెలిపారని తెలుస్తోంది. రెండు మూడ్రోజుల్లో వైసీపీ తీర్ధం పుచ్చుకోవచ్చని సమాచారం. 


Also read: Ys Jagan Bus Yatra: రేపట్నించే వైఎస్ జగన్ బస్సు యాత్ర, షెడ్యూల్ ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook