ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ మూడు రాజధానుల చట్టాన్ని(Ap Three Capitals Bill) రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేపధ్యంలో మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ బిల్లుపై అసెంబ్లీ చర్చ జరుగుతోంది. ఉపసంహరణ బిల్లుపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారామ్(Tammineni Sitaram) అనుమతించడంతో మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 


రాజధాని అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌(Buggana Rajendranath) అన్నారు. చంద్రబాబుది ఊహాజనిత రాజధాని మాత్రమేనని బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. కోస్తాంధ్రను వెనుకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదని మంత్రి బుగ్గన. అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకే ప్రాధాన్యత ఇచ్చాయని గుర్తు చేశారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే.. వేర్పాటు వాదం వస్తుందని శ్రీకృష్ణ కమిటీ నాడే చెప్పిందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)కూడా ఈ అంశంపై మాట్లాడారు. తనకు ఏ ప్రాంతంపైనా ముఖ్యంగా ఈ ప్రాంతంపై వ్యతిరేకత లేదన్నారు. తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని చెప్పారు.


Also read: ఏపీ మూడు రాజధానుల రద్దుపై మంత్రి కొడాలి నాని ఏమన్నారంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook