AP Three Capitals: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇప్పుడు కొడాలి నాని కూడా వ్యాఖ్యానించారు. ఆ కారణంతోనే చట్టాన్ని ఉపసంహరించుకున్నట్టుగా వెల్లడించారు.
ఏపీ మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టుగా హైకోర్టులో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని ఆమోదిస్తూ గతంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్నందున మరోసారి బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని వెనక్కి తీసుకోనుంది. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. జగన్ నిర్ణయం వెనుక కారణాలేంటనేది ఆసక్తిగా మారింది. మూడు రాజధానుల చట్టాన్ని(Ap Three Capitals Bill) వెనక్కి తీసుకోవడం వెనుక మతలబు ఏంటనేది ఆర్ధం కాక మల్లలగుల్లాలు పడుతున్నారు. అదే సమయంలో చట్టం ఉపసంహరణ అనేది కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని..సినిమా ఇంకా ఉందని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ఇదే అంశంపై మరో కీలకమైన మంత్రి కొడాలి నాని(Kodali Nani)వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడంపై స్పందించారు. సాంకేతిక సమస్యల వల్లనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పారు. మూడు రాజధానుల రద్దు నిర్ణయాన్ని ఏపీ కేబినెట్లో తీసుకున్నామని..అసెంబ్లీలోనే ఈ విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బయట మాట్లాడకూడదన్నారు.
Also read: వాట్సప్ వెబ్ వినియోగదారుల కోసం కొత్తగా ప్రైవసీ ఫీచర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook