కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలకు అవార్డుల పంట కలిగింది. ర్యాంకుల మోత మోగింది. విజయవాడ, విశాఖపట్నంలు దేశంలోనే టాప్ టెన్ లో నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ( Swachh Survekshan 2020 ) అవార్డుల్లో ఇండోర్  ( Indore ) తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని విజయవాడ ( Vijayawada ) నాలుగో స్థానాన్ని, విశాఖపట్నం ( Viskhapatnam ) 9వ స్థానాన్ని దక్కించుకుని టాప్ టెన్ లో నిలిచాయి. తిరుపతి ( tirupati ) నగరం సైతం  జాతీయ ర్యాంకింగ్ కేటగరీలో అంటే బెస్ట్ మెగా సిటీ కేటగరీలో ఆరవ స్థానాన్నిదక్కించుకుంది.ఇదే కేటగరీలో రాజమండ్రి ( Rajahmundry ) కి 51వ స్థానం దక్కింది. 


దేశంలో మొత్తం 129 పట్టణాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డుల్ని ప్రకటించింది. దేశంలోని మొత్తం 4 వేల 242 నగరాలు, పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పరివాహక ప్రాంతాల్లోని పట్టణాల్లో ఈ సర్వే ( Survey ) నిర్వహించారు.  28 రోజల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అన్ని అంశాల్ని పరిగణలో తీసుకుని ర్యాంకుల్ని, అవార్డుల్ని కేటాయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్ని 2016 నుంచి ప్రకటిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకుల్ని ఏపీ పట్టణాలు కైవసం చేసుకున్నాయి. రాష్ట్రాల పరంగా ఏపీ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. Also read: Vijayawada Fire Accident: అన్నీ ఉల్లంఘనలే..అన్నీ సీరియస్ అంశాలే