రామ్ చరణ్‌తో కలిసి పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో కలిసేందుకు వస్తున్న నటి జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉందని.. ఈ ప్రేమే తాము రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని తన తల్లి శ్రీదేవి చెప్పిన మాటలను జాన్వీ కపూర్ పునరుద్ఘాటించారు.
Janhvi Speech In Peddi pre release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీకపూర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. జాన్వీకపూర్ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడి అందరిని ఫిదా చేశారు. ఈ మూవీ చాలా స్పెషల్ అని అన్నారు. మీ జీవితంకు అర్థం ఏంటని కనుగొనడమే ఈ మూవీ థీమ్ అన్నారు. నా ఐడెంటీటీ అనేది అభిమానులతో కనెక్ట్ అయి ఉందన్నారు. ఈ మూవీ టీమ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీరంతా మూవీని చూడాలని అన్నారు. ఇక జగదేక వీరుగు.. అతిలోక సుందరీమూవీలోని మానవ.. ఓ మానవ అనే డైలాగ్ క్యూట్ గా తెలుగులో చెప్పి పెద్ది అభిమానుల్ని ఫిదా చేశారు.
Vijayawada: కనకదుర్గ ఆలయం లోని ఇంద్రకీలాద్రికి వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు బొర్రా రాధాకృష్ణ తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో ఘాట్ నిర్మాణం పూర్తైతే భక్తులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఈ ప్రకటనతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Indrakeeladri Ghat: దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును నేటి నుంచి మూసివేయనున్నారు. మరమ్మతుల కారణంగా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు మే 26 నుంచి జూన్ 12 వరకు ఘాట్ రోడ్డు మూసి ఉంచుతామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమకు సహకరించాలని కోరారు.
Two youths fight for girl in Vijayawada: అర్దరాత్రి థార్ వాహనాల్లో ఇద్దరు ప్రేమికులు ఒక యువతి కోసం ఫైటింగ్ కు దిగారు. దీంతో విజయవాడ పడమట హైటెన్షన్ రోడ్డులో తీవ్ర గందర గోళం ఏర్పడింది.
Temple Committee Fraud: భక్తులు దేవుడిపై భక్తితో, ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలను కొంతమంది స్వార్థపరులు తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
YS Sharmila Slams To PM Narendra Modi: భారతదేశ పరువును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగజార్చారని.. ఆయన పిలక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతికి చిక్కిందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ గౌరవాన్ని మోదీ దారుణంగా దిగజార్చారని ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డారు.
APCC Chief YS Sharmila Hot Comments YS Jagan And Chandrababu: తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వారిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోకి పలువురిని షర్మిల ఆహ్వానించారు.
Vijayawada: విజయవాడ కనక దుర్గ గుడిలో ప్రమాదం చోటు చేసుకుంది. మెట్ల పూజ చేస్తుండగా భక్తులపై స్లాప్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో అక్కడే ఉన్న ఓ బాలిక తలపై తీవ్రగాయాలు కావడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో గుడిలో ఉండే డాక్టర్ కూడా అందుబాటులో లేడు. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yarlagadda Venkatrao: జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియను ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పూర్తిచేశారు. జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. జనగణనను పూర్తిచేయాలని సూచించారు.
TDP MLA Yarlagadda Venkatrao Completes Census 2027 Self-Registration: జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. మే 1 నుంచి మే 31 వరకు జనగణన ప్రక్రియ కొనసాగుతుందని.. అందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు.
Vijayawada: తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఉగ్రవాదుల లింక్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయవాడలో ముగ్గురు యువకులను, హైదరాబాద్‌లో ఓ ముస్లిం మహిళను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో సంచలన నిజాలు తెలుస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఓ కొత్త కోణం కూడా బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Vijayawada Crime News: గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో అనేక దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కేటుగాళ్లు దందా మారుస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ దారుణం ఇప్పుడు విజయవాడలో జరిగింది. నగరంలోని భవానీపురంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
Ration Marts: ఏపీలోని కూటమి సర్కార్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేషన్ కోసం గంటల తరబడి రేషన్ షాపుల వద్ద నిలబడి సరుకులు తీసుకోకుండా.. త్వరలో రేషన్ మార్టులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
YS Sharmila Slams To Her Brother YS Jagan Proposal Of MAVIGUN: రాజధానిపై తన సోదరుడు మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మావిగన్ జోకర్ అని విమర్శించారు. వైఎస్సార్ ఆశయాలకు ఆయన వారసుడు కాదని ప్రకటించారు.
Gold Price Drop Today: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ ఒక తీపి కబురు అందించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనల నేపథ్యంలో పసిడి ధరలు ఒక్కసారిగా నీరసించాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సాధారణంగా పెరగాల్సిన బంగారం ధరలు, అనూహ్యంగా తగ్గడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు భారీ స్థాయిలో ధరలు తగ్గడం పసిడి ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డాలర్ విలువ విపరీతంగా బలపడటం, బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల బంగారం డిమాండ్ తగ్గింది.
Vijayawada: విజయవాడలో ఉగ్రవాదుల లింకుల కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు నిందితులకి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో A11 అబ్దుల్ సలాం, A5 సైదా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
Band Melam Movie: కోర్ట్ హీరో హీరోయిన్ మరోసారి జంటగా కనిపించనున్న బ్యాండ్ మేళం సినిమా కోసం విజయవాడలో ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు..
Terror Links Case In Vijayawada: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల లింక్స్ కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే విజయవాడలో ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా హైదరాబాద్‌లోని చంచల్‌గూడాకు చెందిన సయీదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Vijayawada: విజయవాడలో ఉగ్రవాద లింకులు వెలుగు చూడటం రాష్ట్రాన్ని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఈ వార్త తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. విజయవాడ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు యువకులు గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికల్లో.. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు పలుకుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
CM Chandrababu Announced Polavaram Project New Time: అగ్రస్థాయిలో తెలుగు జాతి ఉండాలనే సంకల్పం తనదని.. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో ముందుంచాలనేది తన సంకల్పమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆర్దిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలన్నదే తమ లక్ష్యం అని తెలిపారు.