ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) డీఎస్సీ అభ్యర్ధులకు ( Dsc candidates ) ఏపీ ప్రభుత్వం ( Ap government ) శుభవార్త అందిస్తోంది. 2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ ( SGT Candidates ) అభ్యర్దుల నియామక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ లో 2018లో జరిగిన డీఎస్సీ పరీక్ష ( 2018 Dsc Examination ) లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు రెండేళ్ల నుంచి నియామకం కోసం నిరీక్షిస్తున్నారు. దీనికి కారణం కోర్టులో కేసు పెండింగ్ లో ఉండటమే. ఇప్పుడు డీఎస్సీ 2018 పెండింగ్ కేసును కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Ap Education minister Adimoolapu suresh ) తెలిపారు. డీఎస్సీ 2018 ఎస్జీటీ కేటగరీలో 3 వేల 524 పోస్టుల కోసం నియామక ప్రక్రియను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే 2 వేల 203 మంది అభ్యర్దుల రికార్డుల్ని పరిశీలించడం పూర్తయిందని..మరో 1321 మంది వెరివిఫికేషన్ ఇవాళ్టితో పూర్తవుతుందన్నారు. బుధవారం నాటికి ఆయా అభ్యర్ధులకు ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం అందిస్తామన్నారు. 


ఈ పోస్టింగుల నియామకానికి సంబంధించి సెప్టెంబర్ 24న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో నియామకాలు పూర్తవుతాయని...వెంటనే 26వ తేదీన అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చేస్తామని చెప్పారు. అదే విధంగా డీఎస్సీ 2018కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు మంత్రి సురేశ్. టెట్ సిలబస్ ను కూడా విద్యార్ధుల అవసరాల మేరకు మార్పులు చేసి సిద్ధం చేస్తామన్నారు. Also read: AP: 52 లక్షలు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు