AP: ఎన్నికలపై నిమ్మగడ్డకు అంత తొందరెందుకు ?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిపై అదికార పార్టీ విమర్శలు ఎక్కు పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డకు అంత తొందరెందుకని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిపై అదికార పార్టీ విమర్శలు ఎక్కు పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డకు అంత తొందరెందుకని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
కరోనా వైరస్ ( corona virus ) సంక్రమణ, శీతాకాలం నేపధ్యంలో ప్రజల బాధ్యత ప్రభుత్వంపై ఉందని..అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్ని ( Local body elections ) ఇప్పుడే వద్దంటున్నామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని ( Ap chief secretary neelam sahni ) ఇదే విషయంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. మరోవైపు మంత్రి కొడాలి నాని..నిమ్మగడ్డ ( Nimmagadda Ramesh kumar )పై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna reddy ) నిమ్మగడ్డపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దమేనని...కానీ ప్రభుత్వ పరంగా ప్రజల రక్షణ బాధ్యత తమపై ఉందని అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ( Ap cm ys jagan ) ప్రజల మనిషి అనేది అందరికీ తెలిసిందేనని, 90 శాతానికి పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకటీ రెండు కేసులున్నప్పుడు ఎన్నికల్ని వాయిదా వేసిన ఎన్నికల కమీషనర్..ఇప్పుడెలా ఎన్నికల్ని నిర్వహిస్తారని ప్రశ్నింఛారు. అసలు ఎన్నికల నిర్వహణకు ప్రాతిపదిక ఏమిటని ఆయన అడిగారు. ఓ వైపు ఛీఫ్ సెక్రటరీ సైతం ఎన్నికలు నిర్వహించలేమని చెబుతుంటే..నిమ్మగడ్డకు అంత తొందరెందుకని సజ్జల నిలదీశారు.
కోవిడ్ పూర్తిగా తగ్గిన తర్వాత ఎన్నికలు జరగాలని ప్రభుత్వం తరపున భావిస్తున్నామన్నారు. అప్పుడే అంటే మార్చ్ లోనే ఎన్నికలు పూర్తి చేసి ఉంటే సరిపోయేదని చెప్పారు. ఎన్నికల వాయిదా వెనుక ఉద్దేశాలు, నిమ్మగడ్డ వ్యవహార శైలీ అంతా తమకు అర్ధమైందన్నారు. ఒక రాజకీయపార్టీని ఫ్యాక్షనిస్టు పార్టీగా అభివర్ణించిన వ్యక్తి నిష్పక్షపాతంగా ఉంటాడని భావించడం లేదని చెప్పారు. Also read: AP: నిర్ణయం మార్చుకోండి: ఎన్నికల కమీషనర్ కు నీలం సాహ్ని లేఖ