Ap Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పంచాయితీ ఎన్నికలు ఏకగ్రీవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నజరానాలు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ( Ap Panchayat Elections Schedule ) విడుదలైంది. నాలుగు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. సుప్రీంకోర్టు ( Supreme Court ) తీర్పుతో అనివార్యమైన పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ( Unanimous ) ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఏకగ్రీవాలైతే భారీ నజరానాలు ( Incentives for Unanimously elected panchayats ) ప్రకటిస్తూ ప్రభుత్వం ( Ap Government ) ప్రత్యేక జీవో సైతం జారీ చేసింది. పంచాయితీల్ని నాలుగు కేటగరీలుగా విభజించింది. కేటగరీని బట్టి ప్రోత్సాహకాల్ని ప్రకటించింది.


2 వేల లోపు జనాభా ఉన్న పంచాయితీ ఏకగ్రీవమైతే..5 లక్షల రూపాయలు నజరానా అందిస్తారు. 2 వేల నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయితీ ఏకగ్రీవమైతే 10 లక్షల రూపాయలు బహుమతి అందుతుంది. ఇక 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయితీ ఏకగ్రీవమైతే 15 లక్షల రూపాయలు ప్రోత్సాహకం అందుతుంది. 10 వేల జనాభా ఉన్న పంచాయితీల్ని ఏకగ్రీవం చేస్తే..20 లక్షల రూపాయలు అందించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.


Also read: Republic day celebrations 2021: మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook