Ap Students in Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో చిక్కుకుపోయిన విద్యార్ధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లైట్ టికెట్లను ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ దేశంలోని నగరాల్ని లక్ష్యంగా చేసుకుని అన్ని వైపుల్నించీ ముప్పేట దాడి చేస్తోంది. ఉక్రెయిన్ దేశం గగనతలాన్ని మూసివేయడంతో అక్కడ చిక్కుకుపోయిన విద్యార్ధుల్ని స్వదేశానికి తరలించడం ఆగిపోయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అక్కడున్న విద్యార్ధుల్ని రుమేనియా సరిహద్దుల్నించి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. నిన్న రాత్రి బయలుదేరిన ఓ విమానం ఇప్పటికే కొంతమందిని వెనక్కి తీసుకొచ్చింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్ధుల్లో ఎక్కువమంది ఏపీ, తెలంగాణకు చెందినవారే. ఈ క్రమంలో ఏపీకు చెందిన విద్యార్దుల్ని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 


ఉక్రెయిన్ నుంచి ఏపీకు వచ్చే విద్యార్ధులకు విమాన టికెట్లను ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్లైట్ టికెట్లు తీసుకోలేని విద్యార్ధులకు ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకు చేరుకునే విద్యార్ధులకు..అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు చేర్చే బాధ్యతను అధికారులకు అప్పగించారు జగన్. ఢిల్లీ ఏపీ భవన్‌లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ విద్యార్ధులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌తో ఫోన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. అక్కడి విద్యార్ధులకు ఏ విధమైన ముప్పు లేకుండా సురక్షితంగా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 


Also read: Nellore Crime: హిజ్రాగా మార్చేందుకు..మర్మాంగాన్ని కోసేసి..చివరకు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook