AP Curfew Timings: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న కారణంగా వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపు ఇస్తున్నారు. ఏపీలో గత కొద్దిరోజులుగా కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు (Coronavirus cases) గత కొద్దిరోజులుగా తగ్గుతున్నాయి. మొదట్లో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు 7-8 వేల కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 18 గంటల కర్ఫ్యూను జూన్ 20వ తేదీ వరకూ పొడిగించిన ప్రభుత్వం (Ap government) కర్ఫ్యూ వేళల్లో ఇస్తున్న మినహాయింపును కూడా పెంచింది. ఫలితంగా రోజుకు 18 గంటల కర్ఫ్యూ కాకుండా ఇప్పుడు 16 గంటల కర్ఫ్యూ అమలు కానుంది. రేపట్నించి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ వేళల్లో మార్పులు రానున్నాయి. 


ఇప్పటి వరకూ ప్రతిరోజూ ఉదయం 6 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ కర్ఫ్యూలో(Curfew) మినహాయింపు ఉండేది. ఈ సమయంలోనే ప్రజలు తమ నిత్యావసర పనులు చేసుకునేవారు. రేపట్నించి కర్ఫ్యూ మినహాయింపుని మరో రెండు గంటలు పెంచింది ప్రభుత్వం. అంటే రేపట్నించి ఉదయం 6 గంటల్నించి మద్యాహ్నం 2 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు (Curfew Timings)ఉంటుంది. మద్యాహ్నం 2 గంటల్నించి తిరిగి ఉదయం 6 గంటల వరకూ కఠినమైన కర్ఫ్యూ అమలు కానుంది. కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కర్ఫ్యూ వేళల్లో సడలింపు పెంచడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శన సమయం కూడా పొడిగించారు. రేపట్నించి ఇంద్రీకాలద్రి దర్శనాన్ని మధ్యాహ్నం 1 గంటల వరకూ అనుమతి ఉంటుంది. 


Also read: AP DSC 2008 : ఏపీ డీఎస్సీ 2008 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook