Night Curfew: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకై తీసుకుంటున్న చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతున్న నైట్‌కర్ఫ్యూను(NIght Curfew)మరోసారి పొడిగించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయాలు తప్పవని జగన్ తెలిపారు. ఏపీలో నైట్‌కర్ఫ్యూని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం 2005, ఐపీసీ సెక్షన్ 188 ఇంకా ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. 


అదే సమయంలో పెళ్లిళ్లకు 150 మందికే అనుమతి ఉంది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ తెల్లవారుజామున ముహూర్తం ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)ఆదేశించారు. పండుగల సమయంలో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, షాపుల్లోకి మాస్క్ లేకుండా అనుమతిస్తే జరిమానా ఉంటుంది. అక్కడి పరిస్థితుల ఆధారంగా జరిమానా విధిస్తారు. మరోవైపు 2-3 రోజులు సంబంధిత సంస్థ లేదా షాపును మూసివేస్తారు. కరోనా నిబంధనల్ని ఎవరైనా అతిక్రమించినట్టుగా ఫోటోలు పంపితే చర్యలు తీసుకునేలా అధికారులు ప్రణాళిక రచించారు. 


Also read: Almond Benefits: బాదంను ఎలా తింటే ఎక్కువ లాభాలు కలుగుతాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి