Almond Benefits: డ్రై ఫ్రూట్స్‌లో బాదం మంచి పౌష్టికాహారం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. క్రమం తప్పకుండా రోజూ బాదం తింటే బుద్ధి వికసితమవుతుది. మెదడు ఉత్తేజమవుతుంది. సాధారణ బాదం కంటే తీపి బాదం తింటే వాతం వంటి సమస్యలు కూడా పోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇదికాకుండా చర్మాన్ని సౌందర్యవంతంగా ఉంచుతుంది. అసలు బాదం ఎలా తీసుకునే సరైన పద్దతి ఏంటేది తెలుసుకుందాం. కొంతమంది ఒల్చుకుని తింటే మరి కొంతమంది పాలు లేదా నీళ్లలో నానబెట్టుకుని తింటారు.
బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నానబెట్టిన బాదం పిక్కల్ని నిర్ణీత పరిమాణంలోనూ, నిర్ణీత సమయంలోనూ తీసుకుంటే బరువు తగ్గడంలో కూడా లాభం కలుగుతుంది. అది కాకుండా బొదంలో విటమిన్ బి 17, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండూ కేన్సర్ నుంచి రక్షించేందుకు దోహదపడతాయి.
బాదం తొక్కల్లో ట్యానిన్ ఉంటుంది. ఇది పోషక విలువల్ని తగ్గకుండా కాపాడుతుంది. నీటిలో నానబెట్టినప్పుడు తొక్క సులభంగా వచ్చేయడమే కాకుండా అందులోని పోషక విలువలన్నీ మీరు ప్రయోజనం చేకూరుస్తాయి.
పరగడుపున బాదం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా తింటే గ్యాస్ సమస్య పెరిగిపోతుంది. పరగడుపున తినాల్సివస్తే మాత్రం కూరగాయలు లేదా పండ్లతో కలిపి తినవచ్చు.
బాదం పిక్కల్ని నానబెట్టకుండా లేదా తొక్క ఒల్చకుండా తింటే రక్తంలో అశ్లేషం పెరిగిపోతుంది. బాదం తినే సరైన పద్ధతి రాత్రంగా గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఉదయం తొక్కలు ఒల్చుకుని తినడం. బాదంతో పాటు కిస్మిస్ మరియు ఖర్జూరం కూడా తింటే మరింత మంచిది. రోజుకు పది బాదం పిక్కలు తినవచ్చు.
బాదం ఎప్పుడూ ఆర్గానిక్ మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. బాదం పిక్కల్ని నీటిలో నానబెట్టి తొక్క తీసి తినాలని ఆయుర్వేద శాస్త్రం సూచిస్తోంది. బాదం తొక్కల్ని ఒలిచి తినడం ద్వారా ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేకూరుతుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఆరోగ్యానికి చాలా మంచిది.