ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) జిల్లాల పునర్విభజన ( Districts Reorganisation ) వేగం పుంజుకుంది. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ఏర్పడనుంది. కొత్త జిల్లాల వివరాల్ని సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


2019 అసెంబ్లీ ఎన్నికల్లో ( 2019 Assembly Elections ) వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కమిటీ ఏర్పడింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలుండగా..25 పార్లమెంట్ నియోజకవర్గాల్ని 25 జిల్లాలుగా ( 25 New Districts ) చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) ముందుకుపోతోంది. విశాఖ జిల్లాలోని అరకు పార్లమెంట్( Araku parliament ) పరిధిలో ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా..26 జిల్లాలు ( 26 Districts ) ఏర్పరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అరకు పార్లమెంట్ పరిధి శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకూ విస్తరించి ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయమైంది. 


కృష్ణా జిల్లా పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. అయితే జిల్లా పరిధిలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం ఏలూరు నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకే విజయవాడ, మచిలీపట్నం జిల్లాలుగా విభజించి...కైకలూరు, నూజివీడు ప్రాంతాల్ని ఏలూరు జిల్లాలో కలపనున్నారు. Also read: AP: ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీ ఆసక్తి


అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, నర్శాపురం జిల్లాలుగా ఏర్పడనున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం ప్రాంతాలు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నందున..వీటిని రాజమండ్రి జిల్లాలో కలపనున్నారు. 


అటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం నియోజకవర్గాలు జిల్లాలుగా ఏర్పడనున్నాయి. కానీ ఇదే జిల్లా పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం అరకు నియోజకవర్గంలో ఉన్న కారణంగా...ఈ ప్రాంతాన్ని ఏ జిల్లాలో కలుపుతారనేది ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది. 


కొత్త జిల్లాల ఏర్పాటు ( New Districts Formation ) లో ఏ జిల్లాకు లేని సౌలభ్యం కృష్ణా జిల్లాకుంది. ఎందుకంటే అధికారికంగా కృష్ణా జిల్లా ముఖ్యపట్టణం మచిలీపట్నం కావడంతో బ్రిటీషు హయాంలో నిర్మితమైన భవనాలు, ప్రభుత్వ స్థలాలు చాలానే ఉన్నాయి. అటు విజయవాడలో కూడా క్యాంప్ కార్యాలయాలున్నాయి.అధికారులందరికీ క్యాంప్‌ కార్యాలయాలున్నాయి. కొన్ని శాఖలకు సొంత భవనాలు, మరికొన్ని శాఖలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.  


ఇప్పుడు జిల్లాల పునర్విభజన పనులు ఊపందుకున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆస్థులు, భూముల వివరాల్ని సేకరిస్తున్నారు. శాఖల వారీగా ఏర్పాటు చేయాల్సిన కార్యాలయాల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాలు సరిపోతాయా లేదా అనేది పరిశీలిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ drp.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. Also read: AP: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్ధిక మంత్రితో ముగిసిన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి చర్చలు