Ap Government: ఆర్ 5 జోన్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైన ప్రభుత్వం, సుప్రీంలో పిటీషన్
Ap Government: అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Government: ముందుగా ప్రకటించినట్టే ఆర్ 5 జోన్ ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది. పేదలకు ఇళ్లు నిర్మించాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి ఏపీ హైకోర్టు నిర్ణయం అడ్డంకిగా మారడంతో సుప్రీంకోర్టులో పోరాడేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.
ఏపీలో అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ఆ స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని భావించింది. తొలుత ఆర్ 5 జోన్ ఏర్పాటుకు కూడా వ్యతిరేకత వ్యక్తమైనా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు పట్టాలు జారీ చేసింది. ఇళ్లు నిర్మించే సమయానికి కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ హైకోర్టు నిర్ణయంపై న్యాయ పోరాటానికి దిగాలని సంకల్పించిన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు అమరావతి రైతులు కూడా ఇదే అంశంపై కేవియట్ దాఖలు చేశారు.
ఇప్పటికే రాజకీయంగా ఎదురైన పలు ఆటంకాలు, కోర్టు కేసుల్ని దాటి అమరావతిలో ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇబ్బంది ఎదురైంది. ఈడబ్ల్యూఎస్ కేటగరీ ఇళ్ల పట్టాల జారీ కూడా పూర్తయింది. ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ కూడా శంకుస్థాపన చేశారు. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. అందుకే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.
Also read: YSR Kalyanamasthu: రూ.141.60 కోట్ల ఆర్థిక సాయం.. నేడు అకౌంట్లలోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook