కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు
Covid19 Awareness: కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు దిగింది. కోవిడ్ వ్యాధిని అరికట్టేందుకు విభిన్నమైన అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టింది. మూడు కార్యక్రమాల్ని 27 రోజులపాటు నిర్వహించనుంది.
Covid19 Awareness: కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు దిగింది. కోవిడ్ వ్యాధిని అరికట్టేందుకు విభిన్నమైన అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టింది. మూడు కార్యక్రమాల్ని 27 రోజులపాటు నిర్వహించనుంది.
కరోనా మహమ్మారి(Corona pandemic) భయం ఇంకా వెంటాడుతోంది. ఈ క్రమంలో కోవిడ్ 19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం (Ap Government)విభిన్న ప్రణాళికను అమలు చేస్తోంది. ముఖ్యంగా 3 రకాల ప్రచార కార్యక్రమాల్ని 27 రోజుల పాటు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. మాస్క్ తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, హ్యాండ్‌వాష్‌పై ఫోకస్ పెట్టింది. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన కార్యక్రమాలు 27 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, షార్ట్‌ఫిల్మ్‌లతో ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించాలనే వివరాలతో వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నిఘా, కోవిడ్ పరీక్షల్ని(Covid19 Tests)బలోపేతం చేసిన ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్ చికిత్స, కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాల్ని విస్తృతం చేసింది. గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, రవాణా వాహనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, క్రీడా సముదాయాలు, విహార స్థలాలు, పెళ్లిళ్ల వంటి కార్యక్రమాల్లో ఈ అంశాలపై ప్రచారం నిర్వహిస్తారు.
Also read: బిఎస్ఇఏపి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ 2021: ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల, వెబ్‌సైట్ లింక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook