బిఎస్ఇఏపి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ 2021: ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల, వెబ్‌సైట్ లింక్

AP SSC Results 2021 released: అమరావతి: ఏపీలో పదో తరగతి ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇవాళ సాయంత్రం 5 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2021, 06:26 PM IST
బిఎస్ఇఏపి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ 2021: ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల, వెబ్‌సైట్ లింక్

AP SSC Results 2021 released: అమరావతి: ఏపీలో పదో తరగతి ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇవాళ సాయంత్రం 5 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే మనబడి వెబ్‌సైట్ manabadi website తో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్‌సైట్స్ ద్వారా కూడా ఏపీ పదో తరగతి పరీక్షలు తెలుసుకోవచ్చు. 

పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా వారి వారి ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. టెన్త్ క్లాస్ ఫలితాల విడుదల సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) మాట్లాడుతూ.. ఛాయరతన్ కమిటి సిఫార్సుల ఆధారంగానే గ్రేడ్లు కేటాయించినట్టు తెలిపారు. పరీక్షలు లేకుండానే ఫలితాలు వెల్లడించడం వల్ల ప్రతిభావంతులైన మెరికల్లాంటి విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. గ్రేడ్లు ఇవ్వడం వల్ల విద్యార్థులకు నష్టం జరగదని అన్నారు.

Trending News