Curfew Ralaxations: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశంలో విలయతాండవం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దాదాపుగా తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు వస్తున్నాయి. ఏపీలో మరింతగా సడలింపులు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి ఏపీలో తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజుకు 2-3 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో మరిన్ని సడలింపులు ఇచ్చింది. కొత్తగా ప్రకటించిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్ని తప్పించి..మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కర్ఫ్యూ వేళల్లో సడలింపులిచ్చారు. పది గంటల వరకూ అనుమతి ఉన్నా..వాస్తవానికి 9 గంటలకే షాపుల్ని మూసేయాల్సి ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు(Coronavirus cases) ఇంకా పూర్తిగా తగ్గనందున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే కర్ఫ్యూ వేళల్లో సడలింపు (Curfew Relaxations) ఉంది. షాపులు మాత్రం సాయంత్రం 6 గంటలకే మూసేయాల్సి ఉంటుంది. 


రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెర్చుకునేందుకు కొత్తగా అనుమతిచ్చారు. అయితే ప్రతి సీటుకు మధ్య గ్యాప్ కచ్చితంగా ఉండాలి. ఇక కోవిడ్ ప్రోటోకాల్స్‌తో రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణమండపాలకు అనుమతిచ్చిన ప్రభుత్వం..కరోనా గైడ్‌లైన్స్ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. శానిటైజర్, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. 


Also read: YS Jagan on Srisailam issue: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై కేంద్రమంత్రి షెకావత్‌కు ముఖ్యమంత్రి జగన్ లేఖ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook