YS Jagan on Srisailam issue: ఏపీ, తెలంగాణ విద్యుత్ వివాదం కేంద్రానికి చేరింది. కేంద్ర మంత్రులకు ఏపీ ప్రభుత్వం లేఖల పరంపర కొనసాగుతోంది. మొన్న స్మృతి ఇరానీకు..నేడు జల విద్యుత్ శాఖమంత్రి గజేంద్ర షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల విద్యుత్ వివాదం(Srisailam power project Dispute) నెలకొంది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందనేది ఏపీ ప్రభుత్వ ఆరోపణ. ఈ విషయంలో ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై మొన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకు లేఖ రాసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు(Gajendra Shekhawat) లేఖ రాశారు.
కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని తెలంగాణ వినియోగిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండకుండా అక్రమంగా నీటిని తోడేస్తోందని..జూలై 1 నుంచి ఇప్పటి వరకూ 19 టీఎంసీల నీటిని వినియోగించుకుందని ఆరోపించారు. 796 అడుగుల నీటిమట్టం నుంచే తెలంగాణ నీటిని తోడుతోందని వైఎస్ జగన్ లేఖలో తెలిపారు. శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకపోతే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదని జగన్ స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 8 వందల అడుగుల వద్ద పర్యావరణ అనుమతుల్లేకుండానే తెలంగాణ ప్రభుత్వం(Telangana government) నిర్మిస్తోందని జగన్ ఫిర్యాదు చేశారు.
Also read: Heavy Rains Alert: రానున్న మూడ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook