AP Lockdown: సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా ఏపీ ప్రభుత్వం, రేపు నిర్ణయం వెలువడే అవకాశం
AP Lockdown: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడవచ్చు.
AP Lockdown: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడవచ్చు.
కరోనా నియంత్రణకై ఏపీ ప్రభుత్వం(Ap government) ప్రస్తుతం కర్ఫ్యూ అమలు చేస్తోంది. రోజుకు 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తూ..దైనందిన కార్యక్రమాలు, దుకాణాల కోసం 6 గంటల సేపు వెసులుబాటు కల్పించింది. అయితే కర్ఫ్యూ వల్ల ఏపీలో కరోనా కట్టడి కావడం లేదని తెలుస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 24 వేల కేసులు నమోదయ్యాయి. దాంతో సంపూర్ణ లాక్‌డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయమని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయంపై బహుశా రేపు కీలక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.
కరోనా కట్టడికై చాలా రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ ( Lockdown) అమలు చేస్తున్నాయి. ఏపీలో సంపూర్ణ లాక్‌డౌన్ కాకపోయినా 6 గంటల వెసులుబాటుతో కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినా కరోనా సంక్రమణ ఆగడం లేదు. రాష్ట్రంలో రోజుకు 90 వేల నుంచి లక్ష వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు( Covid19 Tests) చేస్తున్నారు. ఇటు ఏపీలో పాజిటివిటీ రేటు కూడా 20 శాతం దాటేసింది. ఇదే ఇప్పుడు తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. తక్షణం లాక్‌డౌన్ పూర్తిగా విధించకపోతే కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చనే ఆందోళన నెలకొంది. ఏపీలో కరోనా కట్టడికై కఠినమైన సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. పరిస్థితి చేయి దాటకముందే కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Also read: AP Covid Update: కరోనా విజృంభణ, ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook