Liquor Sales: మందుబాబులకు శుభవార్త, ఇక ఆర్ధరాత్రి 1 గంట వరకూ కిక్కే
Liquor Sales: మందుబాబులకు గుడ్‌న్యూస్. ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 31కు సిద్ధమైంది. తాగినోళ్లకు తాగినంతగా జోరుగా మద్యం అమ్మకాలు సాగనున్నాయి. ఇవాళ రాత్రి భారీగా మందు విక్రయాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Liquor Sales: ఏపీలో మద్యం అమ్మకాలు జోరందుకోనున్నాయి. మందుబాబులు ఆనందించేలా శుభవార్త విన్పించింది ఏపీ ప్రభుత్వం. అర్ధరాత్రి వరకూ మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. 2024కు వీడ్కోలు పలికి 2025కు స్వాగతం చెప్పే క్రమంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగించేందుకు సిద్ధమైంది. మద్యం అమ్మకాలకు డిమాండ్ తీర్చేందుకు ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఇవాళ అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 1 గంట వరకూ మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయాలుంటాయి. కానీ ఇవాళ మాత్రం రాత్రి 1 గంట వరకూ లిక్కర్ అమ్మకాలు జరగనున్నాయి.
మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లు కూడా రాత్రి 1 గంట వరకు అనుమతి ఉంటుంది. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ, రాత్రి లిక్కర్ విక్రయాలు జోరందుకోనున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి ఈ ఏడాది అక్టోబర్ 15 తరువాత నుంచి డిసెంబర్ 29 వరకూ రాష్ట్రంలో 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే 75 రోజుల్లో 26,78 లక్షల కేసుల బీర్లు, 83.74 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి.
Also read: Telangana: డిసెంబర్ 31 ఎక్కడపడితే అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పట్టుబడితే అంతే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.