Telangana: ఎవరైనా సరే కొత్త సంవత్సరం ఆనందంగా, ఎలాంటి ఆందోళన లేకుండా గడపాలని అనుకుంటారు. ఇలా జరగాలంటే ఇవాళ డిసెంబర్ 31 రాత్రి వేడుకల్లో పరిధి దాటకుండా ఉండాల్సిందే. లేకపోతే పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పవు. హైదరాబాద్ నగరంలో అటు ట్రాఫిక్ ఆంక్షలు ఇటు మందుబాబులపై నిఘా ఉంటుంది. మందేసి పట్టుబడితే ఇక అంతే సంగతులు.
కొత్త సంవత్సరం వేడుకలు పురస్కరించుకుని హైదరాబాద్ నగర పరిధిలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో ట్రాఫిక్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 దాటితే క్లోజ్ చేస్తారు. అర్ధరాత్రి 2 దాటిన తరువాత హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి అనుమతిస్తారు. ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఔటర్ రింగ్ రోడ్‌ను డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకూ మూసివేయనున్నారు.
ఇక నగరంలో నాగోల్ ఫ్లై ఓర్, కామినేని ఫ్లై ఓవర్, ఎల్‌బి నగర్ ఎక్స్ రోడ్ మల్టీ లెవెల్ ఫై ఓవర్లు, బైరామల్ గూడ ఎక్స్ రోడ్‌లో ఉన్న మొదటి, రెండవ లెవెల్ ఫ్రై ఓవర్, ఎల్‌బి నగర్ అండర్ పాస్, చింతలకుంట అండర్ పాస్‌లను రాత్రి 10 గంటల నుంచి మూసివేయనున్నారు. బేగంపేట్, టోలిచౌకి ఫ్లై ఓవర్లే తెరిచి ఉంటాయి. అదే సమయంలో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకూ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలకు అనుమతి ఉండదు.
డ్రంక్ అండ్ డ్రైవ్ నిఘా
ఇక డిసెంబర్ 31 వేడుకల్లో మందుబాబులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మద్యం తాగి డ్రైవ్ చేసి పట్టుబడితే ఇక అంతే సంగతులు. కొత్త సంవత్సరంలో పోలీస్ స్టేషన్, జైళ్ల చుట్టూ తిరగాల్సిందే. వాహనం సీజ్ అయిపోతుంది. దాంతో పాటు భారీగా జరిమానా ఉంటుంది. బార్, పబ్, క్లబ్స్ ప్రాంగణాల్లో మందేసి వాహనాలు నడపడానికి అనుమతిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నగరంలో విస్తృతంగా నిర్వహించనున్నారు.
Also read: Vitamin C Fruits: విటమిన్ సి లోపముందా, ఈ రెండు ఫ్రూట్స్ తింటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.