ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో మొత్తానికి స్కూళ్ల ప్రారంభం ( Schools reopen ) ఖరారైంది. రెండుసార్లు వాయిదా అనంతరం నవంబర్ 2 నుంచి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) నిర్ణయం తీసుకున్నారు. ఏ రోజు ఏ తరగతులు నిర్వహిస్తారనేది వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Coronavirus ) నేపధ్యంలో  అంటే మార్చ్ నెల నుంచి స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వం, ప్రైవేటు విద్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఇటీవల కొద్దికాలంగా ఆన్ లైన్ క్లాసుల్ని( Online classes ) నిర్వహిస్తూ వస్తున్నాయి కొన్ని విద్యాసంస్థలు. దేశంలో ప్రస్తుతం అన్ లాక్ 5 ప్రక్రియ నడుస్తోంది. విద్యాసంస్థలు, కళాశాలలు తెరిచే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై వదిలిపెట్టింది కేంద్రం. 


వాస్తవానికి ఏపీ ప్రభుత్వం ( Ap Government ) సెప్టెంబర్  నుంచి స్కూళ్లు ప్రారంభించాలని అనుకున్నా కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. తరువాత అక్టోబర్ 15 నుంచి తెరవాలని యోచించినా..మరోసారి వాయిదా వేసింది. ఇప్పుడు చివరికి అన్ని పరిస్థితుల్ని అంచనా వేసి..నవబంర్ 2 నుంచి ప్రారంభించడానికి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు.


అయితే స్కూళ్ల ప్రారంభానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ రోజు ఏ తరగతులకు స్కూళ్లు తెరవాలనేది వెల్లడించారు. 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించనున్నట్లు జగన్ తెలిపారు.  మంగళవారం ‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ వివరాల్ని వెల్లడించారు. 


రెండ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే.. మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నవంబర్‌ నెల నుంచి ప్రారంభమవుతాయని...డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే.. వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. Also read: APPSC JL Results 2020: జేఎల్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ