విజయవాడలో విషాదం: 11కి చేరిన మృతుల సంఖ్య
Vijayawada fire accident Death Toll | విజయవాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య 11కి చేరింది.
విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య 11కి చేరింది. తొలుత ముగ్గురు కోవిడ్19 పేషెంట్లు చనిపోయారని, ఆపై మరణాల సంఖ్య 9కి చేరిందని వెల్లడించారు. తాజాగా ఆ సంఖ్య 11కి చేరడం చూస్తే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తుంది. Vijayawada అగ్నిప్రమాదంపై స్పందించిన సీఎం వైఎస్ జగన్
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనంలో ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కొందరు ప్రాణ భయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకేశారు. Vijayawada: కోవిడ్19 కేర్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
రూ.50 లక్షల పరిహారం (Vijayawada Fire Accident Exgratia)
విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో జరిగిన అగ్రిప్రమాద ఘటనలో మరణించిన కోవిడ్19 పేషెంట్ల బంధువులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...