రాష్ట్రంలోని పలు పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పరిశ్రమలు, పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు (Industrial Accidents In AP) తగ్గించి, సురక్షిత వాతావరణం కల్పించడానికి పరిశ్రమలలో ప్రత్యేక తనిఖీలు (Special Drive At Industries In AP)‌ చేపట్టాలని నిర్ణయించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS JAgan Mohan Reddy) ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో విష వాయువులు విడుదల తర్వాత పలు ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు సంభవించాయి. 5846 కానిస్టేబుల్ జాబ్స్‌.. ఇంటర్ అర్హతతో ఇలా అప్లై చేయండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. చైర్మన్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. జిల్లాలోని పరిశ్రమలలో ప్రత్యేకంగా ఈ కమిటీ సభ్యులు తనిఖీలు చేపట్టనున్నారు. ముఖ్యంగా విష వాయులు, హానికారక రసాయలు, పేలుడు పదార్థాలు, రెడ్ కేటగిరీ పదార్థాలు వినియోగించే పరిశ్రమలపై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. శారీలో డబ్‌స్మాష్ బ్యూటీ Photos 


మొత్తం 90 రోజుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది. ఏదైనా కంపెనీ, పరిశ్రమలో లోపాలున్నట్లు గుర్తిస్తే నెల రోజుల్లో వాటిని సరిదిద్దుకునేలా చేయడమే ఈ కమిటీల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తి సమస్యలను ఎదుర్కొంటుంటే, మరోవైపు పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరగడం ఏపీ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 


స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి పరిశ్రమలలో సాధారణ పరిస్థితిని కల్పిండంతో ప్రజలలో భయాందోళనను దూరం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.   కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి