AP High court: గ్యాగ్ ఆర్డర్ సవాలు చేస్తూ పిటీషన్, ఆ న్యాయవాదికి ఆదేశాలు
అమరావతి భూముల కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ విచారణకొచ్చింది.
అమరావతి భూముల కుంభకోణం ( Amaravati lands scam ) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ( Ap high court gag order ) ను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ విచారణకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి భూముల కుంభకోణం కేసు ఆసక్తి రేపుతోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ( Insider trading ) జరిగిందని..అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా భూములు కొనుగోలు చేసుకున్నారనేది ప్రభుత్వ ఆరోపణ. దీనిపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఇందులో భాగంగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ( Ex Advocate general Dammalapati srinivas ) పై కూడా ఏసీబీ కేసు ( Acb case ) నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలు, మిగిలిన నిందితులు కలిసి జరిపిన భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుంభకోణం ఉందనేది ఏసీబీ ఎఫ్‌ఐఆర్ వివరాలు. ఈ కేసులో ఎవ్వరినీ అరెస్టు చెయ్యవద్దని..ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయరాదంటూ పత్రికలను, టీవీలు, సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఈ నెల 15న ఏపీ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. విచారణపై కూడా స్టే ఇచ్చింది.
హైకోర్టు ఇచ్చిన ఈ గ్యాగ్ ఆర్డర్ ను సవాలు చేస్తూ అడ్వకేట్ మమత న్యాయస్థానంలో పిటిషన్ ( petition on high court's gag order ) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మాజీ అడ్వకేట్ జనరల్ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు హైకోర్టు స్టేను సవాలు చేస్తూ..ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేను రద్దు చేసి విచారణకు అనుమతించాల్సిందిగా పిటీషన్ లో అభ్యర్ధించింది.
ఇదే అంశంపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా చర్చ లేవనెత్తారు. ఏపీ హైకోర్టు ఇచ్చింది అసాధారణ నిర్ణయమని...శాసనవ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం మంచిది కాదని తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు న్యాయ నిపుణులు, రాజకీయ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Also read: AP: పోలవరం ప్రాజెక్టు పర్యటనకు రానున్న కేంద్ర జల వనరుల శాఖ మంత్రి