ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాజధాని అమరావతి ( Amaravati ) పై విచారణ మరోసారి వాయిదా పడింది. నవంబర్ 2 వతేదీకు విచారణను వాయిదా వేస్తు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా పలు అంశాలు చర్చకొచ్చాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశాన్ని ( Ap Three Capitals ) సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై ఏపీ హైకోర్టు ( Ap High court ) లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా రాజధాని తరలింపుపై కోర్టు స్టే ఇచ్చింది. ఇందులో భాగంగా మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలైన అంతర్గత పిటీషన్ పై విచారణ హైకోర్టులో పూర్తయింది. తదుపరి విచారణను నవంబర్ 2 కు వాయిదా వేసింది హైకోర్టు.  


ఈ సందర్బంగా హైకోర్టులో పలు అంశాలు చర్చకొచ్చాయి. విశాఖపట్టణం ( Visakhapatnam ) లో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ ..రాజధానిలో భాగంగా నిర్మిస్తున్నారా అని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అటు విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ గెస్ట్ హౌస్ లకు సంబంధించిన పూర్తి వివరాల్ని కూడా అఫిడవిట్ లో పొందుపర్చలేదన్నారు.  ఇక విశాఖపట్నంలో ఎంత విస్తీర్ణంలో, ఎన్ని గదులు నిర్మిస్తారనేది కూడా స్పష్టం చేయలేదని తెలిపారు.


ప్రభుత్వ నిర్మాణాలకు తమకెటువంటి అభ్యంతరం లేదని..ప్రభుత్వం నిర్మించబోయే గెస్ట్‌హౌస్‌లు చాలా విశాలమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నందునే అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. తాత్కాలికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది గుప్తా కోర్టుకు తెలియజేశారు. 


దీనికి సమాధానంగా విశాఖపట్టణంలో గెస్ట్ హౌస్..రాజధానిలో భాగంగా నిర్మించడం లేదని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలో అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందన్న కారణంతోనే గెస్ట్ హౌస్ నిర్మాణాలను చేపట్టామని వివరించారు. జనాభా దామాషా ప్రాతిపదికన గెస్ట్‌హౌస్ నిర్మాణాలు చేపడుతున్నామని ధర్మాసనానికి ప్రభుత్వం ( Ap Government ) తరపున అడ్వొకేట్ జనరల్ తెలిపారు. Also read: AP: స్థానిక ఎన్నికల అంశం, మరోసారి ప్రభుత్వానికి నిమ్మగడ్డకు వివాదమయ్యేనా