ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ అభ్యంతరాల్ని తోసిపుచ్చిన హైకోర్టు..18వ తేదీకు విచారణ వాయిదా వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ( Ap ) లో స్థానిక సంస్థల ఎన్నికల ( Local body elections ) నిర్వహణకై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda ramesh kumar ) విడుదల చేసిన  ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ అభ్యంతరాల్ని ఎన్నికల కమీషన్ పరిగణలో తీసుకోలేదని భావించిన హైకోర్టు సింగిల్ బెంచ్ షెడ్యూల్ ఉత్తర్వుల్ని కొట్టేసింది. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టలేమని..ఆర్టికల్ 21, 14 ప్రకారం ప్రజలకున్న జీవించే హక్కును కాలరాయలేమని స్పష్టం చేసింది.  ఎన్నికల కమీషన్ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఏకపక్ష ఉత్తర్వుల్ని రద్దు చేసింది. 


హైకోర్టు ( Ap High court ) సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda ramesh kumar ) హైకోర్టు డివిజన్ బెంచ్‌కు హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం..ఎస్ఈసీ అభ్యంతరాల్ని తోసిపుచ్చింది. ఈ పిటీషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని భావిస్తూ..ఈనెల 18 వే తేదీన అంటే కోర్టు సెలవుల తరువాత వాయిదా వేసింది.


కేంద్ర ప్రభుత్వం ( Central Government ) చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) బృహత్కార్యానికి ఎస్ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం విఘాతం కల్గిస్తుందని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఇక తదుపరి విచారణ జనవరి 18వ తేదీన జరగనుంది. 


Also read: Ammavodi Status: జగనన్న అమ్మ ఒడి స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook