ఇప్పటం గ్రామ వ్యవహారం, అక్రమ నిర్మాణాల తొలగింపు చిలికి చిలికి గాలివానలా మారింది. రాజకీయ పార్టీల స్వార్ధ ప్రయోజనాలకు గ్రామస్థులు బలైనట్టు కన్పిస్తోంది. ఏపీ హైకోర్టు ఇప్పటం పిటీషనర్లపై వ్యక్తం చేసిన ఆగ్రహం ఇందుకు కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటం కేసులో ఏకంగా పిటీషనర్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో ముందస్తు షోకాజు నోటీసుల అనంతరం ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు కొన్ని తొలగించింది. ఈ వ్యవహారం కాస్తా పవన్ కళ్యాణ్ పర్యటనతో వివాదాస్పదంగా మారింది. కోర్టును తప్పుదోవ పట్టిస్తూ..పిటీషనర్లు షోకాజ్ నోటీసు లేకుండా ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. షోకాజు నోటీసులిచ్చినట్టుగా ప్రభుత్వం రుజువులు సమర్పించడంతో హైకోర్టు మండిపడింది. చివరికి షోకాజు నోటీసులిచ్చారని పిటీషనర్లు అంగీకరించారు. 


అయితే ఇదే అంశంపై అంటే షోకాజు నోటీసులివ్వలేదంటూ కోర్టుకు అబద్ధాలు చెప్పి పిటీషనర్లు ఇంతకుముందు స్టే తెచ్చుకుని ఉన్నారు. ఇప్పుడు షోకాజు నోటీసులిచ్చినట్టుగా ఒప్పుకోవడంతో..కోర్టును పక్కదారి పట్టించి స్టే తెచ్చుకుంటారా అంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేంటని ఆగ్రహించింది. ఈ విషయమై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పిటీషనర్లను ప్రశ్నించింది. పిటీషనర్లు స్వయంగా హాజరు కావాలని ఆదేశించడంతో..ఇవాళ ఆ విచారణ సాగింది.


అబద్దం చెప్పి స్టే తెచ్చుకోవడం ద్వారా కోర్టును పక్కదారి పట్టించినందుకు పిటీషనర్లు 14 మందికి హైకోర్టు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున 14 లక్షల జరిమానా విధించింది. 


Also read: AP CM YS Jagan: సీఎం జగన్ ఔదార్యం, కాన్వాయ్ ఆపి మరీ..చిన్నారికి సహాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook