AP CM YS Jagan: సీఎం జగన్ ఔదార్యం, కాన్వాయ్ ఆపి మరీ..చిన్నారికి సహాయం

AP CM YS Jagan: నిరుపేద కుటుంబం. ఆ పాప పుట్టినప్పటి నుంచి ఓ వ్యాధితో బాధపడుతోంది. ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నహస్తం అందించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 23, 2022, 11:55 PM IST
AP CM YS Jagan: సీఎం జగన్ ఔదార్యం, కాన్వాయ్ ఆపి మరీ..చిన్నారికి సహాయం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప మనస్సు చాటుకున్న సంఘటన ఇది శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట పర్యటనలో ఓ బాధిత కుటుంబాన్ని కాన్వాయ్ నుంచే గమనించి..ఆదుకున్నారు. అందరి ముందు జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం చిన్న సిర్లం గ్రామానికి చెందిన ఏడేళ్ల మీసాల ఇంద్రజ అనే చిన్నారి పుట్టినప్పుటి నుంచి తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. వైద్యం కోసం చాలా ఆసుపత్రులు తిరిగారు తల్లిదండ్రులు. ఇప్పటికే 4 లక్షల వరకూ ఖర్చు చేసి శస్త్ర చికిత్స చేయించారు. మరోవైపు తండ్రి కిడ్నీవ్యాధితో ఇబ్బంది పడుతూ..తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది ఆ కుటుంబం. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకుని..నరసన్నపేటకు చేరుకుంది ఆ కుటుంబం. ముఖ్యమంత్రిని కలవాలనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు. నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయేంతలో..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి పడనే పడింది.

కాన్వాయ్ నుంచే ఆ పాపను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం దిగి..వెనక్కి ఆ పాప దగ్గరకు వచ్చారు. పాప ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్ధిక నేపధ్యం చూసి చలించిపోయారు. వెంటనే ఎంత ఖర్చైనా సరే..అందించేందుకు సిద్ధమని ప్రకటించి..అక్కడే ఉన్న కలెక్టర్ శ్రీకేష్‌ను ఆదేశించారు. వైద్య సహాయం అందించడమే కాకుండా..తక్షణం పదివేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని సూచించారు. 

కాన్వాయ్ నుంచే ఆ పాపను గమనించి..వాహనం దిగొచ్చి మరీ..తక్షణ సహాయంయ కోసం స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

Also read: AP Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News