AP High Court: స్కిల్ స్కాంపై సీబీఐ విచారణ కోరుతూ ఉండవిల్లి దాఖలు చేసిన పిటీషన్‌పై చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ పిటీషన్‌పై విచారణకు సిద్ధపడిన ఛీఫ్ జస్టిస్ బెంచ్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది. నాట్ బిఫోర్ మి అంశంతో మరో బెంచ్‌కు మార్చడంతో విచారణ వాయిదా పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జరుగుతున్న పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం కేసు దర్యాప్తును సీబీఐతో జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను లిస్టింగ్ చేసిన ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ కేసు విచారణకు జస్టిస్ రఘునందన్ రావు విముఖత ప్రదర్శించారు. మరో బెంచ్‌కు బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. జస్టిస్ రఘునందన్ రావు సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సభ్యులుగా ఉన్నారు. ఉండవిల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చిన 44 మందిలో కొంతమంది తరపున గతంలో తాను వాదించి ఉన్నందున ఈ కేసును విచారించలేనని జస్టిస్ రఘునందన్ రావు స్పష్టం చేశారు. 


ఉండవిల్లి అరుణ్ కుమార్ పేర్కొన్న ప్రతివాదుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈడీ, చంద్రబాబు నాయుడు, డిజైన్ టెక్, సీమెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నాయి. ప్రతివాదుల్లో కొందరి తరపున గతంలో తాను మరో కేసు వాదించి ఉన్నందున ఈ కేసు తన ముందుకు రావడం మంచిది కాదని జస్టిస్ రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. కేసును మరో బెంచ్‌కు బదిలీ చేసిన తరువాత విచారణ తేదీ నిర్ణయమౌతుంది. అప్పటి వరకూ కేసు విచారణ వాయిదా పడింది.


Also read: Ys Jagan: టికెట్లు ఎవరికో తేల్చేసిన జగన్, టికెట్లు రానంత మాత్రాన నా వాళ్లు కాకుండా పోరు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook