Ys Jagan: టికెట్లు ఎవరికో తేల్చేసిన జగన్, టికెట్లు రానంత మాత్రాన నా వాళ్లు కాకుండా పోరు

Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు సమాయత్తమౌతున్నారు. ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రారంభించనున్న వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం గురించి వివరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2023, 08:01 PM IST
Ys Jagan: టికెట్లు ఎవరికో తేల్చేసిన జగన్, టికెట్లు రానంత మాత్రాన నా వాళ్లు కాకుండా పోరు

Ys Jagan: ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. గడప గడపకు కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉండాలని పదే పదే సూచిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి కార్యాచరణను వేగవంతం చేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నది వైనాట్ 175. ఇప్పుడీ లక్ష్యానికి కొనసాగింపుగా మరో లక్ష్యాన్ని చేర్చారు. రాష్ట్రంలో త్వరలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇవాళ  ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ ఇన్‌ఛార్జులతో సమీక్ష నిర్వహించారు. 175కు 175 గెలవడం అసాధ్యమేమీ కాదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ జరిగింది ఓ ఎత్తైతే ఇక ముందు జరిగేది మరో ఎత్తు అని తెలిపారు. రానున్న 6 నెలలు ఎలా పనిచేస్తామనేదే ముఖ్యమన్నారు. ఇప్పుడిక గేర్ మార్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు వైఎస్ జగన్. త్వరలో వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం ప్రారంభించనున్నట్టు చెప్పారు. 

ప్రభుత్వం పట్ల ప్లజల్లో సానుకూలత ఉందని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇక నుంచి కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చారు. ఒంటరిగా పోటీ చేయలేకే ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు వైఎస్ జగన్. పార్టీకు, ప్రభుత్వానికి ఇది సానుకూల అంశంగా భావించాలన్నారు. ఇదే ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. 

టికెట్ అనేది పూర్తిగా పనితీరు, సర్వేల ప్రాతిపదికన కేటాయిస్తామన్నారు. టికెట్ రానంతమాత్రాన నా వాళ్లు కాకుండా పోరని మరో విధంగా అవకాశమిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. టికెట్లపై ప్రతి ఒక్కరూ తన నిర్ణయాల్ని పెద్ద మనస్సుతో స్వాగతించాలని కోరారు. సర్వేలు తుది దశకు వస్తున్నాయని, చివరి దశ సర్వేలు కూడా ఉంటాయన్నారు. 

Also read: Inner Case: లోకేశ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు, ఇన్నర్ కేసులో ఏ14గా నారా లోకేశ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News