Ap Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఏకగ్రీవాల హవా వీచింది. ఊహించినట్టే ఏకగ్రీవాలన్నీ అధికారపార్టీ వశమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజారంజక పాలనకు నిదర్శనమే మున్సిపల్ ఫలితాలని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో పంచాయితీ ఎన్నికల (Ap panchayat elections)తరహాలోనే మున్సిపల్ ఎన్నిక( Ap municipal elections)ల్లో సైతం అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( Ysr congress party) సానుభూతిపరులు 80 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నిక్లలో సైతం ప్రజలు అధికారపార్టీ అభ్యర్ధులకు పట్టం కడతారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజారంజక పాలనకు నిదర్శనమే ఏకగ్రీవాల్లో వస్తున్న ఫలితాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా విశ్వసించడం వల్లనే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వేల 797 వార్డుల్లో 571 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రభుత్వం పన్నులు పెంచుతుందంటూ చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. 


ఇక పట్టణ ప్రజల వైద్య అవసరాల్ని తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)చేతుల మీదుగా త్వరలో 550 అర్బన్ క్లినిక్‌లు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని గుర్తు చేశారు. చంద్రబాబు కల్లబొల్లి మాటల్ని నమ్మవద్దని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక విశాఖ ఉక్కు కోసం తలపెట్టిన రేపటి రాష్ట్ర బంద్‌( Ap state Bandh)కు సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. 


Also read: Ap state bundh: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు బంద్, ప్రభుత్వం సంఘీభావం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook