Ap state bundh: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకించింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్(Vizag Steel plant)ను ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం(Central government)నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తక్షణం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధాని మోదీకు లేఖ కూడా రాశారు. ఇటీవలే విశాఖ పర్యటన సందర్బంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు.
అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన విశాఖలో భారీ పాదయాత్ర కూడా చేపట్టారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ(Vizag steel plant privatisation)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా రాష్ట్ర బంద్ (Ap state Bandh) రేపు జరగనుంది. ఈ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. బంద్‌కు మద్దతుగా రేపు మద్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేస్తామని..ఆ తరువాత కార్మికులంతా నల్లబ్యాడ్జీలు ధరించిన విధులు నిర్వహిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు. బంద్‌కు మద్దతుగా ఎక్కడికక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలు రేపు మూసివేస్తున్నట్టు ప్రకటించాయి.
Also read: Ease of living index 2020: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో టాప్‌లో బెంగళూరు..కాకినాడ, తిరుపతి నగరాలకూ చోటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook