Ysr congress party victory: తుడుచుపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ: మంత్రి బొత్స సత్యనారాయణ
Ysr congress party victory: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Ysr congress party victory: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో (Ap municpal elections) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంద శాతం విజయం సాధించిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు. 22 నెలల ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు ఘన విజయం అందించారని చెప్పారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ మద్దతిస్తారనడానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనమన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజల వద్దకు వెళ్తున్నామని మంత్రి బొత్స చెప్పారు. తెలుగుదేశం ఎన్ని కుట్రలు చేసినా, దౌర్జన్యాలు చేసినా ప్రజలు మాత్రం వైసీపీనే నమ్మారని తెలిపారు. ప్రజలపై తనకు నమ్మకముందని జగన్ చెప్పే సంగతిని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమవైపే ఉన్నారనేది ముఖ్యమంత్రి జగన్ (Ap cm ys jagan) ఆలోచన అని ..ఎప్పుడూ అదే చెబుతుంటారని అన్నారు. తమకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన పట్టణ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తెలిపారు. మేయర్, ఛైర్మన్ ఎంపికను పార్టీ అధ్యక్షుడే నిర్ణయిస్తారన్నారు. తెలుగుదేశం పార్టీని ఒక సామాజిక వర్గ పార్టీగా మారుస్తున్నారంటూ సొంతపార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయన్నారు. మాయమాటలు, మోసం చేసే వ్యక్తికి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అమరావతి, విశాఖ ఉక్కు అంటూ చంద్రబాబు రాజకీయం చేయబోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తండ్రీకొడుకులు ఎలా మాట్లాడారో రాష్ట్రమంతా చూసిందన్నారు.
Also read: Ap Municipal Elections Results 2021: జగన్ పాలనకు నిదర్శనమే ఎన్నికల ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook