Minister Kodali Nani: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వ్యవహారంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆ నలుగురికి కరోనా కంటే భయంకర లక్షణాలున్నాయని దుయ్యబట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం (Ap government) కరోనా మహమ్మారి కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని మంత్రి కొడాలి నాని (Kodali Nani) స్పష్టం చేశారు. ఓ వైపు వ్యాక్సిన్ సరఫరా లేక ఇబ్బంది పడుతుంటే ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే వ్యాక్సిన్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)..కేంద్రానికి రెండు సార్లు లేఖ రాశారన్నారు. ఇవేమీ కన్పించని ఆ నలుగురు 16 వందల కోట్లు పెట్టి ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు చేయలేకపోతోందంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారని విమర్శించారు.రోజుకు 10 లక్షల వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని..16 వందల కోట్లను ఎక్కడికి పంపించాలో చెప్పాలని..ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అయితే చంద్రబాబు(Chandrababu), రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడులకు ఇవేమీ కన్పించవని..కరోనా కంటే భయంకర లక్షణాలున్నాయని మండిపడ్డారు. 


రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కరోనాతోనే చనిపోయారని బాబు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో అయితే ఎన్ 440 కే వైరస్ (N440K Virus)ఉందని చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేశారన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేందుకు సీబీఎన్ 420 అనే వైరస్ నారావారిపల్లెలో పుట్టిందని ఎద్దేవా చేశారు. కరోనా చికిత్సకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. కరోనా విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కేసులు పెట్టి జైళ్లో ఉంచాలని మంత్రి కొడాలి నాని కోరారు. 


Also read: Oxygen Production: ఆక్సిజన్ ఉత్పత్తికి నేవల్, స్టీల్‌ప్లాంట్ అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook