డబ్బులు ఎగ్గొట్టింది చంద్రబాబు. తీర్చింది ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏంటి..అర్ధం కాలేదా. మంత్రి కన్నబాబు ఇదే అంటున్నారు మరి. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ( Ex Cm Chandrababu ) చేసిన బాకీలు, ఎగ్గొట్టిన డబ్బుల గురించి  ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ( Ap Minister kannababu ) వివరించారు. రైతుల భీమా సొమ్మును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెల్లించకుండా ఎగ్గొట్టారని..ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఈ సొమ్ము చెల్లించారని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.  ఏ సీజన్ లో పంటనష్టం జరిగితే పరిహారం అదే సీజన్ లో చెల్లించే విధంగా ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan ) చర్యలు తీసుకున్నారని చెప్పారు. రైతులకు సహాయం చేసేందుకు గ్రామస్థాయిలో సలహా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.  


ఈ సారి రబీ పంట ( Rabi Crop ) కు..121 రోజుల పాటు నీరందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరుస్తామన్నారు. ఇరిగేషన్ నిర్వహణ పనుల్ని వేగవంతం చేస్తున్నామని..ఈసారికి రైతులు షార్ట్ డ్యూరేషన్ పంటలు వేసుకోవాలని సూచించారు. రైతులకు సంబంధించిన బకాయిలు 277 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాలో వేశామన్నారు. వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకంతో ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఏపీ ఇన్సూరెన్స్ కంపెనీ ( Ap Insurance company ) రూపుదిద్దుకుంటోందని మంత్రి కన్నబాబు వివరించారు. హైదరాబాద్ లో ఉంటూ ఏపీపై పెత్తనం చెలాయించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని..తన మార్కు పధకమిదీ అని ఒక్కటైనా చెప్పగలరా అంటూ బాబుకు సవాల్ విసిరారు.


Also read: Tirupati Bypoll: బీజేపీ-జనసేన చర్చలు, తిరుపతి స్థానం జనసేనకా ?