Tirupati Bypoll: బీజేపీ-జనసేన చర్చలు, తిరుపతి స్థానం జనసేనకా ?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  పోటీ విషయమై తప్పటడుగులు వేసిన జనసేన..ఇకపై కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. తిరుపతి సీటును కోరుతూ బీజేపీ ముందు ప్రతిపాదన ఉంచనుంది.

Last Updated : Nov 24, 2020, 01:08 PM IST
Tirupati Bypoll: బీజేపీ-జనసేన చర్చలు, తిరుపతి స్థానం జనసేనకా ?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  పోటీ విషయమై తప్పటడుగులు వేసిన జనసేన..ఇకపై కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. తిరుపతి సీటును కోరుతూ బీజేపీ ముందు ప్రతిపాదన ఉంచనుంది.

2019 ఎన్నికల్లో పరాజయం అనంతరం జనసేన పార్టీ మరోసారి బీజేపీతో జత చేరింది. బీజేపీ భాగస్వామ్యపక్షంగా చేరి ఏపీ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని భావించింది. అయితే సీట్ల పంపకాలు, అభ్యర్ధుల ఎంపిక వంటి అంశాల్లో బీజేపీ నీడలోనే మెలుగుతూ వస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేక..కమలనాధుల వెంటే పయనిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ( GHMC Elections ) వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) రెండ్రోజుల్లోనే మాట మార్చేశారు. జనసేన ( Janasena party ) ప్రకటనతో రంగంలో దిగిన బీజేపీ నేతలు గ్రేటర్ బరి నుంచి పవన్ కళ్యాణ్ ను తప్పించగలిగారు. బీజేపీకే మద్దతిస్తున్నట్టు ప్రకటింపచేశారు. ఈ పరిణామం జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో నిరాశకు దారి తీసింది. పవన్‌ ప్రకటనతో పోటీకి సిద్ధమైన నేతల ఆశలపై పవన్‌ నీళ్లు చల్లారని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే నిరసన స్వరం వినిపించారు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక ( Greater Hyderabad Elections ) ల్లో ప్రచారం చేయాలంటూ బీజేపీ..పవన్ కళ్యాణ్ ను కోరుతోంది. ఈ క్రమంలో బీజేపీ ( BJP ) పెద్దలతో భేటీకు పవన్ సిద్ధమై..ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ), తదితరుల్ని కలవనున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్దిని పోటీకి దించాలనే అంశంతో పాటు..గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం గురించి చర్చించనున్నారు. గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తప్పుకుని బీజేపీకు మద్దతిస్తున్నందున...తిరుపతి సీటును తమకు కేటాయించాలనే ప్రతిపాదనను బీజేపీ పెద్దల ముందు పవన్ కళ్యాణ్ ఉంచనున్నారు. తిరుపతి సీటు ఇప్పుడు రెండు పార్టీలకు కీలకంగా మారింది. గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకున్నట్టుగా...తిరుపతి బరి నుంచి బీజేపీ తప్పుకుంటుందా లేదా పోటీలో ఉండి మరోసారి జనసేనను తప్పిస్తుందా అనేది వేచి చూాడాలి.

ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నిక ( Dubbaka Bypoll )లో విజయంతో ఊపు మీద ఉన్న కమలనాథులు తిరుపతి సీటు ( Tirupati Loksabha )ను వదులుకుంటారా అనేది అనుమానమే. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి తిరుపతిలో 16 వేల ఓట్లు వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని జనసేనకే సీటు కేటాయించాలనేది ఆ పార్టీ ప్రతిపాదన. అయితే గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించని జనసేన పార్టీకు తిరుపతి సీటు కేటాయిస్తే..నిండా మునిగిపోతామని అంతర్గతంగా బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. Also read: TRS Manifesto: టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే

Trending News