ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్( Ap Endowment minister Vellampalli Srinivas ) మరోసారి అస్వస్థత పాలయ్యారు. ఈసారి పరిస్థితి సీరియస్ కావడంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులకు అనారోగ్యం వెంటాడుతోంది. కరోనా వైరస్ కారణంగా ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికు రెండోసారి కరోనా వైరస్ సోకింది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. 


గత నెలలో తిరుమలలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (  Brahmotsavalu ) మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) తో కలిసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ సమయంలో అందరితో కలివిడిగా ఉన్నారు. అక్కడ్నించి వచ్చిన అనంతరంత కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులకు పైగా ఉండి చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తరువాత ఈ నెల 8వ తేదీన విజయవాడలోని పాఠశాల విద్యార్దులకు జగనన్న విద్యాకానుక అందించారు. 


ఇప్పుడు మరోసారి అనారోగ్యం పాలయ్యారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా వైరస్ ( Coronavirus ) రెండోసారి సోకిందా అనే అనుమానం కలుగుతోంది. వైద్యులు ఇంకా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈసారి పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు  ఈ నెల 17 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా మంత్రి వెల్లంపల్లి...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరారు. Also read: Building washed away in flood: వరదల్లో కూలి కొట్టుకుపోయిన కొత్త బిల్డింగ్