Building washed away in flood: వరదల్లో కూలి కొట్టుకుపోయిన కొత్త బిల్డింగ్

ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ( Heavy rain in AP) ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో రాష్ట్రం నలుమూలలా నదులు, కాల్వలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ( West Godavari ) తమ్మిలేరు, ఎర్రకాల్వ పొంగి ప్రవహిస్తున్నాయి.

Last Updated : Oct 15, 2020, 02:45 PM IST
Building washed away in flood: వరదల్లో కూలి కొట్టుకుపోయిన కొత్త బిల్డింగ్

అమరావతి: ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ( Heavy rain ) ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో రాష్ట్రం నలుమూలలా నదులు, కాల్వలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ( West Godavari ) తమ్మిలేరు, ఎర్రకాల్వ పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలూరు, నిడదవోలు, దెందులూరు, తాడేపల్లిగూడెం, భీమవరం పరిసర మండలాల్లో వరద ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంది. తమ్మిలేరు కాల్వకు ( Tammileru ) గండి పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య అటువైపుగా రాకపోకలు నిలిపేశారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఎర్రకాల్వకు ( Yerrakaluva ) గండిపడటంతో పరిసర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. దెందులూరు మండలం సత్యనారాయణపురంలోనూ గండేరువాగుకు ( Ganderuvaagu ) గండ్లు పడటంతో అక్కడ సైతం లోతట్టు ప్రాంతాలు పూర్తి జలమయమయ్యాయి. Also read : Kishan Reddy: అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ ( Rain in East Godavari dist ) ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. జగ్గంపేట మండలం రామవరంలో వరద తాకిడికి కొత్తగా నిర్మించిన ఇల్లు కూలి వరదలోనే కొట్టుకుపోయింది ( House washed away in flood). Also read : AP: భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News