Vidadala Rajani: అరకేజీ నూనె, కందిపప్పు, చీర ఇస్తామని చెప్పి ప్రాణాలు తీశారు.. ఏకిపారేసిన మంత్రి విడదల రజిని
Vidadala Rajani Slams Chandrababu Naidu: గుంటూరు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను మంత్రి విడదల రజనీ పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Vidadala Rajani Slams Chandrababu Naidu: గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సభలో తొక్కిసలాట చోటుచేసుకున్న ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కందుకూరు దుర్ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి చోటుచేసుకున్న ఈ తొక్కిసలాటలో మరో ముగ్గురు మహిళలు మృతి చెందడం రాజకీయంగా చంద్రబాబు నాయుడిని తీవ్ర ఇరకాటంలో పడేసింది. ఈ ఘటనపై ఏపీలోని అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
గుంటూరు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను మంత్రి విడదల రజనీ పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి విడదల రజిని.. చంద్రబాబు నాయుడు ప్రచార యావ వల్లే ముగ్గురు మహిళల అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సభా ప్రాంగణం వద్ద జనాన్ని ఎక్కువ చూపించుకోవడం కోసం అర కేజీ నూనె, అర కేజీ కందిపప్పు, చీర ఇస్తామంటూ జనాలను వాహనాలలో తీసుకువచ్చారని.. మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళలను లైన్లలో నిలబెట్టారని అన్నారు.
చంద్రబాబు మాయమాటలు నమ్మి వచ్చిన అమాయక మహిళలు ఈ దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరం అని మంత్రి విడదల రజిని విచారం వ్యక్తంచేశారు. చంద్రబాబు నాయుడు అధికార యావకోసం... పార్టీ ఆర్భాటాల కోసం అభంశుభం తెలియని అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అమానుషం అని మండిపడ్డారు. ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారి చావులకు చంద్రబాబు పూర్తిగా బాధ్యత వహించి తీరాలి అని డిమాండ్ చేసిన ఆమె.. కనీసం ఈ ఘటనతోనైనా చంద్రబాబు నాయుడు బుద్ది తెచ్చుకోవాలి అని హితవు పలికారు. పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చాం అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Guntur Stampede: గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం జగన్
ఇది కూడా చదవండి : Stampede in Chandrababu Guntur Sabha: గుంటూరు బాబు సభలో తొక్కిసలాట..ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం!
ఇది కూడా చదవండి : Stampede at Chandrababu Meeting: బాబు సభలో అపశ్రుతి.. ఏడుగురు మృతి..8 మందికి తీవ్ర అస్వస్థత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook