AP Municipal Election Results 2021: ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, YSRCP ముందంజ
AP Municipal Election Results 2021 Live Update: ఏలూరు మినహా 11 నగరపాలక సంస్థలు, 72 పురపాలక, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నేటి (ఆదివారం) ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.
AP Municipal Election Results 2021 Live Update: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక, నగర పాలక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్నాయి. నేటి (ఆదివారం) ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఒక డివిజన్ పూర్తయ్యాక మరో డివిజన్ లేక వార్డుల పోస్ట్ బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్ చేస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 144 సెక్షన్ విధించారు.
ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలను అధికార వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. పులివెందుల, మాచర్ల మున్సిపాలిటీలతో పాటు పుంగనూరు, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అయితే ఉదయం 10:30 గంటల లోపు తొలి ఫలితం రానుంది. నేటి సాయంత్రం 6 గంటల్లోగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మినహా ఇతర మునిసిపల్ కార్పొరేషన్లలో ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తంగా 7,549 మంది అభ్యర్థులు పురపాలక, నగరపాలక ఎన్నికల(AP Municipal Elections 2021) బరిలో నిలిచారు. మార్చి 10న నిర్వహించిన ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించారు.
Also Read: AP Municipal Elections Counting: 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల కౌంటింగ్
ఇప్పటికే 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ పలు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొత్తం 20 వార్డులకుగాను 20 గెలుపొంది వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే నెల్లిమర్లలో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి అనూహ్యంగా ఓటమి చెందారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి మహాలక్ష్మి ఓటమి చెందారు. నెల్లిమర్లలో మొత్తం 20 వార్డులుండగా., ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఏపీ(Andhra Pradesh)లోని పలు కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలకు 2020 మార్చి 9న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా, కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఎలక్షన్ వాయిదా పడింది. ఏకంగా ఏడాది తరువాత ఏపీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. మార్చి 14న షెడ్యూల్ ప్రకారం నేడు ఓట్లు లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఏలూరు మినహా 11 నగరపాలక సంస్థలు, 72 పురపాలక, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Also Read: Eluru Election: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook