AP New Cabinet: ఏపీలో వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి బడగు బలహీనవర్గాలకు పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 25 మందితో కూడిన కొత్త కేబినెట్‌లో 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకే కేటాయించినట్లు తెలిపారు. పేదలకు కేవలం తాయిలాలు ఇవ్వకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి వారికి పాలనలో భాగస్వామ్యం కల్పిస్తున్నారని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు హయాంలో కేవలం 48 శాతం మంది బడుగు బలహీనవర్గాల నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించారన్నారు. 2014 నుంచి నవంబర్, 2018 వరకు ఒక్క ఎస్టీ, మైనారిటీకి కూడా కేబినెట్‌లో చోటు లేదన్నారు. కేబినెట్ నుంచి బీజేపీ నేతలు తప్పుకున్న తర్వాతే ఒక ఎస్టీ, మైనారిటీకి అవకాశం కల్పించారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని రీతిలో సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని అమలుచేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, మేదావులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.


కొత్త కేబినెట్‌లో 11 మంది పాతవారికి అవకాశం కల్పించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాత కేబినెట్‌లో మాదిరి ఇప్పుడు కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలిపారు. గత కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉండగా ఈసారి ఆ సంఖ్య నాలుగుకి పెరిగిందన్నారు. మంత్రి పదవులు దక్కనివారు నిరుత్సాహపడవద్దని.. రాగద్వేషాలకు అతీతంగా కొత్త కేబినెట్‌ కూర్పు జరిగిందని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ, కులాలు, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ కేబినెట్ కూర్పు జరిగినట్లు వెల్లడించారు. 


Also Read: Secret Affair: ప్రముఖ డైరెక్టర్‌తో సీక్రెట్ ఎఫైర్... ప్రెగ్నెన్సీ కూడా... బాంబు పేల్చిన నటి మందనా కరిమి...


Weekly Horoscope: రాశి ఫలాలు ఏప్రిల్ 11-ఏప్రిల్ 17... ఆ రాశి వారికి ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook