AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ మరో 4-5 రోజుల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రంలో కొత్త జిల్లాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ప్రాధమిక నోటిఫికేషన్ వెలువడింది. నెల రోజుల వ్యవధితో కొత్త జిల్లాలపై అభ్యంతరాల్ని స్వీకరించింది. అటు కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే అభ్యంతరాల్ని పరిశీలించి నివేదిక రూపొందించేందుకు ప్రభుత్వం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో తుది పరిశీలన జరుగుతోంది. 


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ మరో 4-5 రోజుల్లో విడుదల కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా కొత్త జిల్లాల్ని ప్రారంభించనున్నారు. ఈలోగా తుది నోటిఫికేషన్ విడుదల కావల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అరకు పార్లమెంట్ భౌగోళికంగా పెద్దది కావడంతో రెండుగా చేశారు. ఇలా మొత్తం 26 జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలపై, పేర్లపై, కేంద్రాలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 


ఇప్పటికే కొత్త జిల్లాల కార్యాలయాల్ని ఆయా జిల్లాల్లో తాత్కాలికంగా గుర్తించారు. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో కలెక్టర్, జేసీ, ఎస్పీలను ప్రభుత్వం నియమించనుంది. మరోవైపు రెవిన్యూ డివిజన్లు కూడా పెరగనున్నాయి. పోలీస్ శాఖలో కూడా విభజనకు కసరత్తు జరుగుతోంది. 


Also read: AP govt on Pegasus spyware: భూమన కరుణాకర్‌ రెడ్డి చైర్మెన్‌గా పెగాసస్ హౌజ్ కమిటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook