ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కొత్త జిల్లాల్ని ( New Districts ) 2021 జనవరి 26కు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.  ముందుగా ఊహించినట్టే 26 జిల్లాలు ( 26 new districts ) ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ( Ap ) లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి‌ నీలం సాహ్ని అధ్యక్షత వహిస్తుండగా, సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికార్లు సభ్యులుగా, కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారు.


వాస్తవానికి ఒక్కొక్క పార్లమెంట్ నియోజవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఆలోచన. ఈ లెక్కన 25 జిల్లాలు ఏర్పాటు కావల్సి ఉంది.  అయితే విశాఖ జిల్లాలోని అరకు పార్లమెంట్ పరిధిలో కాస్త సంక్లిష్టత నెలకొంది. ఈ నియోజకవర్గ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల గిరిజన ప్రాంతాలు వస్తాయి. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారనుంది. తూర్పు గోదావరి జిల్లా ( East Godavari District ) రంపచోడవరం వాసులకు గానీ, విజయనగరం, శ్రీకాకుళం గిరిజన ప్రాంత ప్రజలకు గానీ అరకు భౌగోళికంగా చాలా దూరమవుతుంది. అందుకే ఇక్కడ మరో జిల్లా అదనంగా రానుంది. Also read: AP: ప్రభుత్వ కీలక నిర్ణయం, ఏ సీజన్ నష్టానికి అదే సీజన్‌లో పరిహారం


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) తన పాదయాత్ర ( jagan padayatra ) లోనే హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ హామీకు తగ్గట్టుగా ఇప్పుడు కార్యాచరణ ప్రారంభమైంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ( Ap districts re organising committee ) లో కీలకమైన ఘట్టంగా భావించే పునర్ వ్యవస్థీకరణ కమిటీను ఛీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేశారు.  సాధ్యాసాధ్యాల్ని, ఇబ్బందుల్ని, సాంకేతిక అంశాల్ని, ఖర్చును ఈ కమిటీ అధ్యయనం చేసిన తరువాత జిల్లాల రూపకల్పన ఉంటుంది. ఇప్పుడు కొత్త జిల్లాలపై ప్రకటన 2021 జనవరి 26న రానుందని తెలుస్తోంది. 


అయితే అనంతపురం, కర్నూలు జిల్లాలో చాలాకాలంగా పుట్టపర్తి, ఆదోని జిల్లాల ఏర్పాటు డిమాండ్ ఉంది. దీనిపై కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. రాయలసీమ ( Rayalaseema ) లోని నాలుగు జిల్లాలు 8 జిల్లాలుగా..ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు 5 జిల్లాలుగా మారనున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు 4 జిల్లాలుగా ఏర్పడనున్నాయి. తూర్పు గోదావరి జిల్లా 3 జిల్లాలుగా ఏర్పడనుంది. ఇక ఉత్తరాంధ్ర ( Uthrandhra ) లోని మూడు జిల్లాల్ని 6 జిల్లాలుగా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. Also read: AP Grama Sachivalayam 2020 Results: ఏపీ గ్రామ, వార్డు సచివాలయం ఫలితాలు కోసం క్లిక్ చేయండి